ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది దుర్మరణం
- పెళ్ళి బృందంతో వెళ్తున్న చిన్న ట్రక్కును ఢీకొట్టిన కంటైనర్
- ఘటన జరిగినప్పుడు ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణికులు
- గాయపడిన వారిలో విషమంగా కొందరి పరిస్థితి
మహారాష్ట్రలోని పాల్ఘర్లో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పెళ్ళి బృందంతో వెళుతున్న ట్రక్కును కంటైనర్ బలంగా ఢీకొట్టడంతో 12 మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి వారితో వెళుతున్న ట్రక్కును పశువులతో వెళుతున్న కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు ట్రక్కులో 100 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడటంతో పెద్ద ఎత్తున అంబులెన్సులను మోహరించారు.ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.